‘మునుగోడులో బీఆర్ఎస్దే విజయం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 3న గెలుస్తున్నరు. నేను తీసుకున్న నియోజకవర్గ దత్తత కొనసాగుతుంది. చేయాల్సింది ఇంకా ఉంది. అభివృద్ధికి ఏది కావాలన్నా చేస్తా’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోకు ఆయన హాజరై ప్రసంగించారు. ఉప ఎన్నికలో హామీ ఇచ్చిన విధంగా చండూరును రెవెన్యూ డివిజన్ చేశామని, చౌటుప్పల్‌లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని, మర్రిగూడలో ఆస్పత్రిని ప్రారంభించామని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఉప ఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి.. అభివృద్ధి చేశామని వివరించారు. ఏడాది కింద రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో..? ఎందుకు బీజేపీలో చేరారో..? మళ్లీ ఎందుకు కాంగ్రెస్‌లో చేరారో..? అంతుచిక్కడం లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి పచ్చి రాజకీయ అవకాశవాది అని, డబ్బు మదంతో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేండ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి, మునుగోడు ప్రజలకు ఆయన చేసిందేమీలేదని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ధరణి వద్దు, రైతు బంధు వద్దు అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. రోడ్ షోకు పెద్ద సంఖ్యలో హాజరైన బీఆర్ఎస్ శ్రేణులతో చౌటుప్పల్ గులాబీమయమైంది.
(నమస్తే తెలంగాణ) : ‘మునుగోడులో మనమే గెలుస్తున్నం. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు పక్కా. మరింత అభివృద్ధి జరుగాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్ ప్రసంగించారు. ఏడాది కింద రాజగోపాల్‌రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో..? ఎందుకు బీజేపీలో చేరారో..? మళ్లీ ఎందుకు కాంగ్రెస్‌లో చేరారో..? అంతుచిక్కడం లేదన్నారు.
రాజగోపాల్‌రెడ్డి పచ్చి రాజకీయ అవకాశవాది అని, డబ్బు మదంతో, అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేండ్లపాటు ఎమ్మెల్యేగా ఉండి.. మునుగోడు ప్రజలకు ఆయన చేసిందేమీ లేదని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ టికెట్ తెచ్చుకుని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఏడాది కిందట ఉప ఎన్నికల్లో ఓడిపోయాక పత్తాలేకుండా పోయాడని, మళ్లీ ఇప్పుడు ఎన్నికలకు వచ్చాడని దుయ్యబట్టారు. ధరణి, రైతుబంధు వద్దు అని కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క అంటున్నారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో నిత్యం ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవని, మోటర్లు కాలిపోయేవని కేటీఆర్ గుర్తుచేశారు. హస్తం పార్టీ పాలనలో ఎప్పుడు విద్యుత్ వస్తుందో..? ఎప్పుడు పోతుందో..? తెలియదని, రైతులు రాత్రివేళల్లో పొలాల వద్ద పాములు, తేళ్లు కుట్టి, కొన్ని సమయాల్లో నక్సలైట్ల చేతిలో బలయ్యేవారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 గంటల కరెంట్ కావాలా..? 24 గంటల విద్యుత్ కావాలా అనేది ప్రజలు, రైతులు ఆలోచన చేయాలన్నారు. అవ్వాతాతల ఆసరా పింఛన్ రూ.2,016 నుంచి రూ.5 వేలు చేస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ రూ.400కే ఇప్పిస్తామని, మిగతా రూ.800 ప్రభుత్వమే భరిస్తుందన్నారు. తెల్లరేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. భూమిలేనోళ్లకు కూడా రైతుబీమా తరహాలో కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు.
చౌటుప్పల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని, మునుగోడులో 30 పడకల ఆస్పత్రి, మునుగోడును మున్సిపాలిటీ చేస్తామని హామీ ఇచ్చారు. చౌటుప్పల్‌లో ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పారు. శివన్నగూడెం నిర్వాసితులకు అండగా ఉంటామని, బాధితులకు అన్యాయం చేయబోమని, వాళ్లకు అందాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తామన్నారు. నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నానని, నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. అన్నీ చేస్తామని, కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పాల్వాయి స్రవంతిరెడ్డి, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గీత కార్మికుల అభివృద్ధి సమాఖ్య అధ్యక్షుడు పల్లె రవికుమార్‌గౌడ్ పాల్గొన్నారు.
చౌటుప్పల్ : ఎన్నికలు వస్తయి, పోతయి కానీ ప్రజలు ఆగమాగం, గందరగోళానికి గురికాకుండా అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ‘ఒక కొబ్బరికాయ 100 పనులు’ అనే మోసపు మాటలు నమ్మి గెలిపిస్తే ఒక్క పనీ చేయలేదన్నారు. తాను ఓడినా నిత్యం ప్రజల మధ్యనే ఉన్నానని తెలిపారు.
2014 ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో రూ.3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు గుర్తు చేశారు. ఉప ఎన్నిక తర్వాత రూ.600 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని పనులు పూర్తికాగా, మరికొన్ని జరుగుతున్నాయన్నారు. తనకు మరోసారి అవకాశమిస్తే ఈ పనులతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తానని తెలిపారు. చౌటుప్పల్‌లో డిగ్రీ కళాశాల, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, మునుగోడు మున్సిపాలిటీ ఏర్పాటుతోపాటు 30 పడకల దవాఖాన, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్‌కు విన్నవించారు.