నల్లగొండ సిటీ, జనవరి 02 : నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పాయల్ రాజుకు తెలంగాణ సేవా పథకం లభించింది. 2000 సంవత్సరంలో పోలీస్ శాఖలో చేరిన ఆయన 25 సంవత్సరాల సుదీర్ఘ సేవా ప్రయాణంలో క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ఆదర్శ పోలీస్‌గా గుర్తింపు పొందారు. జిల్లా స్పెషల్ పార్టీలో 8 సంవత్సరాల సేవలందించి కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు. క్రైమ్ డ్యూటీలోనూ అనేక క్లిష్టమైన కేసుల డిటెక్షన్‌లో ముఖ్య భూమిక పోషించారు. జిల్లాలో సంచలనమైన కిడ్నీ రాకెట్ కేసు చేదనలో ఆయన చూపిన ధైర్య సాహసాలు, నైపుణ్యంతో 2022లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. టూ టౌన్ ఎస్ఐ వై.సైదులు శుక్రవారం పాయల్ రాజును సన్మానించారు. డీఎస్పీ, సీఐ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.