నల్లగొండ రూరల్, జనవరి 23 : చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, పరిశ్రమ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమం కోసం చేనేత బోర్డును ఏర్పాటు చేసి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల డిమాండ్లను పరిష్కారించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా, నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు.
చేనేత కార్మికుడిని యజమానిగా చేసే వర్కర్ టూ ఓనర్ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ఇల్లు లేని కార్మికులకు రూ.5 లక్షల పెట్టుబడి సాయం అందించి హౌజ్ కం వర్క్ఫెడ్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు గణేశ్, కర్నాటి వెంకటేశం, నాగరాజు, దశరథ, సైదులు, శివ, వెంకటేశం, నరసింహ పాల్గొన్నారు.