‘ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావాలి’
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
– మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
మిర్యాలగూడ, ఆగస్టు 31 : సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకురావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణం రెడ్డి కాలనీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
3వ తేదీ నాడు చేపట్టే రైతు సదస్సులో భాగంగా కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరుఅవుతారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ధనావత్ చిట్టిబాబు నాయక్, ధనావత్ బాలాజీ నాయక్, కుందూరు వీరకోటి రెడ్డి, కుర్ర సేవ్యా నాయక్, చౌగాని భిక్షం గౌడ్, అమరావతి సైదులు, పాశం నరసింహ రెడ్డి, కొత్త మరేడ్డి, అలాకాని రమణ, సందేషి అంజన్ రాజు, మాలవాత్ రవీందర్ నాయక్, ఎండీ.షోయబ్, ఎల్గుబెల్లి నాగరాజు, వెంకన్న యాదవ్, రాజబోయిన గోపి యాదవ్, వడ్త్య శివ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

