నల్లగొండ ప్రతినిధి, జూలై 9 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసే విధంగా తీసుకువస్తున్న 44 చట్టాలతోపాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సక్సెస్ అయినట్లు ట్రేడ్ యూనియన్ నేతలు ప్రకటించారు. సమ్మెకు వివిధ వర్గాల కార్మికులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,కాంట్రాక్టు ఉద్యోగ సిబ్బంది, అసంఘటిత కార్మిక వర్గాల నుంచి విశేష మద్దతు లభించిందని, నాలుగు లక్షల మంది పైచిలుకు సమ్మెలో పాల్గొన్నారని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో సీఐటీయూ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. వీరితోపాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వంలోని పలు విభాగాల ఉద్యోగులు కూడా సమ్మెలో భాగస్వాములయ్యారు. ఇక అసంఘటిత రంగంలోని భవన నిర్మాణ కార్మికులు, రైస్‌మిల్లుల హమాలీలు, పవర్ లూమ్స్ కార్మికులు, అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్నా భోజన సిబ్బంది, ఐకే పీ బీవోఏలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ వర్కర్లు, ట్రాన్స్‌పోర్టు రంగంలోని లారీ, ఆటో కార్మికులు, కాం ట్రాక్టు ఉద్యోగులు, సిబ్బంది ఇలా వేలాది మంది సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
కార్మిక సంఘ నేతలు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 450 రైస్‌మిల్లులు, వివిధ రకాల 150 పరిశ్రమలు, 600 పవర్లూమ్స, పలు ఫార్మా కంపెనీలు, 10 పవర్ ప్లాంట్లు సమ్మెతో మూతపడ్డాయి. 14 ప్రాజెక్టుల పరిధిలోని 3వేల అంగన్వాడీ కేంద్రాలు సమ్మెతో తెరుచుకోలేదు. 3వేల మంది ఆశవర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. మధ్యా హ్నా భోజన పథకంలోని 2500 మంది సిబ్బంది, ఐకేపీ బీవోఏలు 1500 మంది, గ్రామ పంచాయతీ కార్మికులు 2500 మంది, 1500 మంది మున్సిపల్ వర్కర్లు, వివిధ విభాగాలకు చెందిన 2వేల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసీ, బ్యాంకులు, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ విభాగాల్లోని ఉద్యోగులు, సిబ్బం ది సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వీటిల్లో రోజంతా కార్యకలాపాలు స్థంభించిపోయినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైద్య విభాగంలోని కాంట్రాక్టు సిబ్బంది కూడా సమ్మెకు మద్దతుగా తరలివెళ్లారు. ఆర్టీసీలోని సుమారు 500 మంది సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొంటూ విధులకు దూరం గా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారు 5వేలకు పైగా సమ్మె నోటీసులు జారీ చేశామని, అందుకు అనుగుణంగా సమ్మెకు విస్త్రత మద్దతు లభించిందని కార్మిక సంఘాల నేతలు తుమ్మల వీరారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, ఆర్.ఆచారి ప్రకటించారు.
భారీ నిరసన ర్యాలీలు, సభలు
సమ్మె సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు మండల కేంద్రాలు, మేజర్ గ్రా మాల్లో సైతం సమ్మెతో నిరసన ర్యాలీలు, సభలు నిర్వహించా రు. నల్లగొండలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వందలాది మంది కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మిర్యాలగూడ, నకిరేకల్, దేవరకొండ, హా లియా, చండూరు, సూ ర్యాపేట, కోదాడ, హు జూర్‌నగర్, తిర్మలగిరి, భువనగిరి, చౌటుప్ప ల్, ఆలేరు, మోత్కూ రు, బీబీనగర్, తదితర పట్టణాల్లో భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.