ఆత్మకూరు ఎస్, నవంబర్ 22 : ఈ నెల 28న సూర్యాపేట జూనియర్ కళాశాలలో జరిగే గీతన్నల రణభేరి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉయ్యాల నగేశ్ కోరారు. శనివారం ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని గట్టికల్లు గ్రామంలో జరిగిన సమావేశంలో మహాసభ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పెన్షన్ రూ.4 వేల పెంచాలని, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియా వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండు రమేశ్, మడ్డి వెంకన్న, జేరిపోతుల కృష్ణ, నోముల వెంకన్న, రాచకొండ రమేశ్, మడ్డి నారాయణ, గిలకత్తుల అంజయ్య, అనంతుల భిక్షం, గుండు లింగయ్య, నారాయణ, సత్తయ్య, మడ్డి లింగయ్య, వంశీ, శ్రీహరి పాల్గొన్నారు.