– సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు పిలుపు
చండూరు, జూన్ 06 : చండూరు మున్సిపల్ కేంద్రంలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఆదివారం నిర్వహించే ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారిచే చండూరు వాస్తవ్యులు డాక్టర్ చిలుకూరి రామకృష్ణ ప్రసాద్ క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుడు, డాక్టర్ శిరీష, బ్రెస్ట్ శస్త్ర శిక్షిత్స నిపుణురాలుచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నందు సాధారణ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్ లాంటి వాటిని స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించినట్లు వెల్లడించారు. కావున చండూరు మండల, మున్సిపల్ ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.