కొండమల్లేపల్లి, మార్చి 31 : కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో పోలీస్ శాఖ చేపడుతున్న అలైవ్.. అరైవ్ కార్యక్రమంలో భాగంగా లారీ డ్రైవర్లు, క్లీనర్లకు, ఇతర వాహన డ్రైవర్లకు కంటి పరీక్షల నిర్వహించి ఉచితంగా అద్దాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ తమ ఆరోగ్యం పట్ల దృష్టి వహించాలని, రోడ్డు భద్రత నిబంధనలను పాటించాలని సూచించారు. అనంతరం ద్విచక్ర వాహనదారులు 20 మందికి పైగా ఉచితంగా హెల్మెట్లను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన కొండమల్లేపల్లి సీఐ, ఎస్ఐ లతోపాటు సహకరించిన గ్రామ సర్పంచ్ పందుల వెంకటయ్యకు ఎస్పీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

చిన్నఅడిశర్లపల్లిలో లారీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు