రామగిరి, ఫిబ్రవరి 11: గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నల్లగొండ టీఎన్జీఓ భవనంలో గ్రూప్ -4 అభ్యర్థులకు ఉచితంగా నిర్వహిస్తున్న శిక్షణను ఆ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి శనివారం సందర్శించారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచి తంగా మధ్యాహ్న భోజనం అందిస్తా మన్నారు. 15 ఏండ్ల అనుభవం ఉన్న అధ్యాపకులతో అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని వారికి సూచించారు. అనంతరం అమిత్‌రెడ్డి బాప్టిస్ట్ మహిళా అసోసియేషన్ 63వ ఉమెన్స్ మీట్లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్ణణ మహిళా అధ్యక్షురాలు దుబ్బ అశోక్సుందర్రూప, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర్లు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సభ్యులు స్వామిగౌడ్, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు బషీరొద్దీన్, పార్టీ మై నార్టీ నాయకుడు హన్ను పాల్గొన్నారు.