మునుగోడు, జనవరి 10 : కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓటమితో నిరాశ చెందవద్దన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేయాలన్నారు.
తాను మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి అనంతరం ఈ ప్రాంతం అభివృద్ధికి రూ. 570 కోట్లు నిధులు మంజూరు చేయించినానని ప్రస్తుత ఎమ్మెల్యే అ నిధులు ఈ ప్రాంతం అభివృద్ధికి ఖర్చు చేయాలని సూచించారు. నియోజకవర్గంలో బెల్టు షాపులు మూసి వేయిస్తానని చెప్పిన ప్రస్తుత ఎమ్మెల్యే మాటలను స్వాగితిస్తున్నాను. బెల్టు షాపులు మూసి వేయడానికి సమాచారం ఇచ్చిన వ్యక్తికి తానే స్వయంగా రూ.2 వేలు పారితోషికం ఇస్తానన్నారు. 2003 నుంచి ఉద్యమంలో పని చేశానని, ఓటమికి నిరాశ పడేది లేదన్నారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన 2014 గెలిచాను, 2018 ఎన్నికల్లో ఓడిపోయిన 2023లో ఉప ఎన్నికల్లో గెలిచాను.
ఇప్పుడు ఓడిపోయిన మళ్లీ గెలుస్తానని కార్యకర్తలను ఉత్సాహ పర్చిచారు. నా బలం,బలగం మీరేన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మందుల సత్యం, ప్రధాన కార్యదర్శి పగిళ్ల సతీశ్, ఎంపీటీసీలు పోలగోని విజయలక్ష్మీసైదులు గౌడ్, ఈద నిర్మలాశరత్బాబు, బొల్గూరి లింగయ్య, చెరకు కృష్ణయ్య, ఏరుకొండ శ్రీనువాస్, గ్రామపంచాయతీ కో-ఆప్షన్ సభ్యుడు పాలకూరి నర్సింహగౌడ్, ఆయా గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు ముఖ్యకార్యకర్తలు పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని వట్టిపల్లి సర్పంచ్ కల్లు స్వాతీనవీన్రెడ్డి తల్లి కల్లు జయమ్మ బుధవారం అనారోగ్యంతో మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బుధవారం ఆమె మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.