శాసన మండలికి విద్యావంతుడైన రాకేశ్‌రెడ్డిని పంపించాలి
మాయమాటలు చెప్పి మోసం వారిని కాకుండా విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని శాసనమండలికి పంపించాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. భువనగిరి పట్టణంలో ఎల్ఐసీ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు, పట్టభద్రులను ఆయన కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నమూనా బ్యాలెట్ పత్రాన్ని అందజేశారు.
- కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మాయమాటలు నమ్మొద్దు
- మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు చింతల
భువనగిరి అర్బన్, మే 24 : మాయమాటలు చెప్పి మోసం వారిని కాకుండా విద్యావంతుడైన ఏనుగుల రాకేశ్‌రెడ్డిని శాసనమండలికి పంపించాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. భువనగిరి పట్టణంలో ఎల్ఐసీ కార్యాలయంలో శుక్రవారం ఉద్యోగులు, పట్టభద్రులను ఆయన కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల నమూనా బ్యాలెట్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పైళ్ల శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాయమాటలు చెప్పి పట్టభద్రులను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు.
పట్టభద్రుల సమస్యలపై ప్రశ్నించే వ్యక్తి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అని, ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే అది బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యపడుతుందన్నారు.
అదే విధంగా భువనగిరి పట్టణంలోని పలు ప్రైవేటు జూనియర్ కళాశాల ఉపాధ్యాయులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి కలిసి ఎమ్మెల్సీ ఓటును రాకేశ్‌రెడ్డికి వేయాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి ఇబ్రహీం, పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్, జనగాం పాండు, నాయకులు జడల అమరేందర్‌గౌడ్, కొలుపుల అమరేందర్, ఎనబోయిన ఆంజనేయులు, చింతల కిష్టయ్య, రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, జడల యశీల్, అజీమ్, బబ్లూ, తాడెం రాజశేఖర్, సుభాశ్, పెంట నితీశ్, నాగారం సూరజ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

