మిర్యాలగూడ, మే 18 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ పట్టణ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు తమ వార్డుల్లోని పట్టభద్రులను కలిసి రాకేశ్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించాలన్నారు.
ఈ నెల 21న పట్టణంలోని రామచంద్రగూడెం ఎస్వీ గార్డెన్లో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి హాజరవుతారని, పట్టభద్రులంతా హాజరు కావాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జునాచారి, యడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పెండ్యాల పద్మ, కరీం, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.