ప్రభుత్వంపై జనంలో.. తీవ్ర వ్యతిరేకత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రకాల సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఒకే చోటా పరిష్కారం దొరికేలా యాప్‌ను రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ యువనేత ఏనుగు రాకేష్‌రెడ్డి రూపొందించిన ఈ-క్లాసెస్ యాప్‌ను ఆయన మంగళవారం స్థానిక పిస్తా హౌజ్‌లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
- పది నిమిషాలు కూడా ప్రసంగించలేని దౌర్భాగ్య స్థితి ముఖ్యమంత్రిది
- కాక్రోచ్ జనతా పార్టీకి 15 కోట్ల ఫాలోవర్స్ పెరగడం వ్యతిరేకతకు నిదర్శనం
- ఈ-క్లాసెస్ యాప్‌తో అన్ని పోటీ పరీక్షలకు ఒకే చోట పరిషారం
- రాకేశ్‌రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
నీలగిరి, జూన్ 2: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ రకాల సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షలకు ఒకే చోటా పరిష్కారం దొరికేలా యాప్‌ను రూపొందించడం అభినందనీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ యువనేత ఏనుగు రాకేష్‌రెడ్డి రూపొందించిన ఈ-క్లాసెస్ యాప్‌ను ఆయన మంగళవారం స్థానిక పిస్తా హౌజ్‌లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి కృష్ణా గోదావరి నదుల మధ్య రాష్ర్టాన్ని సాధించి దేశంలోనే ఆగ్రగామిగా నిలిపితే రేవంత్‌రెడ్డి సర్కార్ దాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లిందన్నారు. ఎండ కొడుతోందంటూ తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని 10 నిమిషాల్లోనే ముగించాడని, రాష్ర్టాభివృద్ధికి పది నిమిషాలు కూడా ప్రసంగించలేని దౌర్భాగ్య స్థితిలో సీఎం ఉన్నారన్నారు. సీఎంకు జై తెలంగాణ అనడమే ఇష్టం ఉండదని, అసలు ఆయనకు రాష్ట్రంపై ప్రేమే లేదని చెప్పారు.
రాష్ట్రాన్ని ఎలాంటి మూర్ఖుల చేతిలో పెట్టామో జనం అర్థం చేసుకోవాలన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని రేవంత్ రెడ్డికి అర్థమైందని, దోచుకొని దాచుకునేందుకే ఆయన పనిచేస్తున్నారని విమర్శించారు. కాక్రో చ్ జనతా పార్టీ లాంటి ఆన్లైన్ పార్టీకి 15 రోజుల్లోనే 15 కోట్ల మంది ఫాలోవర్స్ పెరగడం చూస్తుంటే ప్రభుత్వాలపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతోందన్నారు. తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా పాలించి ప్రత్యక్షంగా పరోక్షంగా కోటి ఉద్యోగాలు సృష్టించారని, తాను మంత్రిగా పనిచేసిన విద్యుత్తు విభాగంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ దేశంలోనే అత్యుత్తమ ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చి 20 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
కేసీఆర్ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ సైతం మూడు లక్షల నుంచి 15 లక్షలకు చేరిందన్నారు. కరెంట్, తాగునీటిని అందించి కృష్ణ, గోదావరి నదుల నీళ్లను తెచ్చి సురక్షితంగా ఇంటింటికి సరఫరా చేశామన్నారు. దేశానికే గొప్ప అని చెప్పుకునే ప్రధాని మోదీ రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఆరు గంటల విద్యుత్తు ఇస్తున్నారన్నారు. దేశంలో ఎకడాలేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు లేవని, తెలంగాణ గురించి మాట్లాడుకోవడమే ఆ రెండు పార్టీలకు ఇష్టం ఉండదన్నారు. రాకేష్ రెడ్డి తెచ్చిన యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సాగే పోరాటాల్లోనూ యువత, నిరుద్యోగులు ముందుండాలన్నారు.
మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జనం కోసమే పనిచేస్తుందన్నారు. కాంగ్రెసోళ్ల మాటలు నమ్మి మోసపోయామని తెలంగాణ ప్రజలంతా గ్రహించారని, వారి పాలనలో ఏ ఒక వర్గానికి న్యాయం జరగలేదన్నారు. జిల్లా మంత్రులు హెలికాప్టర్లలో తిరిగేందుకే పరిమితమయ్యారన్నారు. నాడు మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి జిల్లా కోసం ఎంతో కృషి చేశారన్నారు. యువత కోసం ఆలోచించిన రాకేష్ రెడ్డికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ రాకేష్ రెడ్డి యువత కోసం ఎంతో కృషి చేస్తున్నారని, కానీ గత ఎన్నికల్లో యువత ఓట్లు వేయించుకున్న వ్యక్తి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ యువతను పట్టించుకోవడంలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగ నియమాక పత్రాలు అందజేస్తున్నారు తప్ప కొత్తగా ఒక నోటిఫికేషన్ వేయలేదన్నారు. రాకేష్ రెడ్డి యాప్‌ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సాధించాలన్నారు.
మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో 1.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేశారని, కానీ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేసి తప్పుడు లెక్కలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. రెండున్నరేండ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ సరార్ యువతను ఘోరంగా మోసం చేసిందన్నారు. ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ పడినా ప్రిపరేషన్ కోసం రాకేష్ రెడ్డి యాప్ ఉపయోగ పడుతుందన్నారు. బీఆర్ఎస్ యువనేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ యాప్ ఆవిషరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కేసీఆర్ పదేండ్ల కాలంలో ఎన్నో ఉద్యోగాలు ఇచ్చారని, అప్పుడు ఆయన ఇచ్చిన నోటిఫికేషన్లకు, పరీక్షల ఫలితాలకు రేవంత్ రెడ్డి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారే తప్ప రెండున్నరేండ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులకు అండగా ఉండేందుకు ఆన్లైన్ యాప్‌ను రూపొందించామని, ఈ-క్లాసెస్ యాప్ ఎకడున్నా ప్రిపరేషన్ విషయంలో యువతకు ఉపయుక్తంగా ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఇస్లావత్ రాంచంద్ర నాయక్, పల్లె రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, బాణోతు దీప్లా నాయక్, కుందూరు ప్రవీణ్‌కుమార్ రెడ్డి, రత్నపురం శ్రీనివాస్, పేర్ల ఆశోక్, గోపగాని స్వాతీ రాజశేఖర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నాయకులు మిర్యాల యాదగిరి, సింగం రామ్మోహన్, గుండెబోయిన జంగ య్య, కాసం శేఖర్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

