అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే పద్మావతి
విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ముగింపు సందర్భంగా..
కోదాడ, ఏప్రిల్ 20 : విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ అగ్నిమాపక కార్యాలయంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. కోదాడ ఫైర్ స్టేషన్‌కు త్వరలోనే సరికొత్త ఫైర్ ఇంజిన్ వాహనాన్ని మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అలాగే సిబ్బంది, బాలాజీ నగర్ ప్రజల కోసం కార్యాలయ ఆవరణలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, వైస్ చైర్మన్ మల్లీశ్వరి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,జిల్లా ఫైర్ ఆఫీసర్ వై కృష్ణారెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ డాక్టర్ బాబు, స్థానిక కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ హరిప్రసాద్, చైతన్య నాయక్ మున్సిపల్ కమిషనర్ రమాదేవి సిబ్బంది పాల్గొన్నారు.

అగ్నిమాపక సిబ్బంది సేవలు అభినందనీయం : ఎమ్మెల్యే పద్మావతి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

