శాలిగౌరారం, జూన్ 18 : శాలిగౌరారం మండలంలోని చిత్తలూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గిరగాని నరేశ్ ఇటీవల తుడిమిడి గ్రామంలో ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. తుడిమిడి గ్రామంలోని ట్రాక్టర్ యూనియన్ అధ్వర్యంలో రూ.85 వేలు జమ చేశారు. ఈ నగదును బుధవారం నరేశ్ కుటుంబ సభ్యులకు శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరు శంకర్రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొమ్మగారి రవి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.