నల్లగొండ, జూన్ 15 : పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, అందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి విరివిగా మొక్కలు నాటి సంరక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని నల్లగొండ నగర 48వ డివిజన్ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు యామ దయాకర్ అన్నారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా క్లీన్ హోమ్ గ్రీన్ హోమ్ ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 48వ డివిజన్ ను పరిశుభ్రమైన డివిజన్ గా, ప్లాస్టిక్ రహిత డివిజన్ గా హరితమైన ఆహ్లాదకరమైన డివిజన్ గా మార్చాలని, దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని డివిజన్ ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మంచాలపు శ్రీనివాస్, దాసరి వెంకట్, జీనుగుల శివ, తోట భగత్, గడగోజు విజయ్, చిన్నబోయిన గణేష్, మిరియాల శ్రీనివాస్, కాలనీవాసులు పాల్గొన్నారు.