భూదాన్‌పోచంపల్లి, అక్టోబర్ 26 : బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కోరారు. గురువారం భూదాన్‌పోచంపల్లిలోని 9, 10, 11 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలు పంచుకుంటున్న తనను మూడోసారి ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తానని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గల్లంతు కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
మంత్రి కేటీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రైతాంగానికి సాగునీటి కాలువల అభివృద్ధితో పాటు ఈ ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్న వంతెన నిర్మాణాలు, రోడ్డు రవాణా వ్యవస్థ కోసం కృషి చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చిట్టిప్రోలు విజయలక్ష్మీశ్రీనివాస్, వైస్ చైర్మన్ బాతుక లింగస్వామి, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, సీత వెంకటేశం, పట్టణ ప్రధాన కార్యదర్శులు గునిగంటి మల్లేశంగౌడ్,
సీత శ్రవణ్, జిల్లా నాయకులు తడక రమేశ్, అంకం పాండు, చింతకింది కిరణ్, కౌన్సిలర్లు కుడికాల అఖిలాబలరాం, పెద్దల చక్రపాణి, సామల మల్లారెడ్డి, దేవరాయకుమార్, గుండు మధు, కర్నాటి రవీందర్, కోఆప్షన్ సభ్యులు నుస్రత్ సుల్తానాషరీఫ్, జల్ది నర్సింహ, అజ్జు నాయకులు సార బాలయ్య, జింకల యాదగిరి, చేరాల నర్సింహ, అంకం యాదగిరి, రుద్ర చెన్నకేశవులు, సంగం చంద్రయ్య, పోనమోని శ్రీశైలం, తంగెళ్ల దశరథ, వంగూరి పెంటయ్య, దేవరకొండ ఆనంద్, పెద్దల శేఖర్, భారత గిరి, అంజమ్మ, రాజేశ్వరి, విజయలక్ష్మి, కుసుమ, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.