కట్టంగూర్, సెప్టెంబర్ 24 : హైదరాబాద్ నుండి సూర్యాపేటలో జరుగు మాల మహానాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గండమల్ల చెన్నయ్యకు బుధవారం కట్టంగూర్‌లో మాల మహానాడు నాయకులు స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. మండలంలో మాల మహానాడును బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. మాలల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. స్వాగతం పలికిన వారిలో జిల్లా అధ్యక్షుడు లకుమాల మధుబాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నాగమణి, ఉపాధ్యక్షురాలు రాయల మౌనిక, జిల్లా కార్యదర్శి బూరుగు శ్రీలత, నియోజకవర్గ అధ్యక్షుడు ముడుసు భిక్షపతి, మండల అధ్యక్షులు గండమల్ల అంతయ్య, రేకల భిక్షం, నాయకులు బొల్లెద్దు నర్సింహ్మ, బొల్లెద్దు లక్ష్మినారాయణ, గోగు మహేష్, గండమల్ల కిరణ్, ఏకుల సైదులు ఉన్నారు.