రేవంత్ ప్రభుత్వ పాలనలో విద్యాశాఖ ఆగమాగం : బొడ్డుపల్లి కృష్ణ
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు..
దేవరకొండ రూరల్, జూలై 09 : తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అడ్మిషన్ల లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన 21.39 లక్షల అడ్మిషన్ల లక్ష్యానికి బదులుగా కేవలం 17.73 లక్షల మంది విద్యార్థులు మాత్రమే నమోదు కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే లక్షన్నర మందికి పైగా అడ్మిషన్లు తగ్గడం ప్రభుత్వ విద్యపై ప్రజల విశ్వాసం తగ్గిందనే విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు, నాణ్యత క్షీణించాయని ఆరోపించారు.
గత 31 నెలల్లో ఫుడ్ పాయిజన్‌తో పాటు ఇతర ఘటనల్లో 133 మంది గురుకుల విద్యార్థులు మరణించడం అత్యంత విషాదకరమని, ఈ ఘటనలతో తమ పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారన్నారు. ప్రభుత్వం బూట్లు, బెల్టులు, యూనిఫారాలు, ఎడ్యుకేషన్ కిట్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇప్పటికీ అనేక మంది విద్యార్థులకు అవి పూర్తిస్థాయిలో అందలేదని విమర్శించారు. ప్రచార ఆర్భాటం కంటే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేసినప్పటికీ అడ్మిషన్లు పెరగకపోవడం ఆందోళనకరమని, ప్రభుత్వ విద్యా సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గి, ప్రైవేట్ పాఠశాలల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు, విద్యార్థుల భద్రత, మౌలిక వసతులు, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangula Kamalakar | ‘నవంబర్ 29’ తెలంగాణ చరిత్ర గతిని మార్చిన రోజు : గంగుల కమలాకర్
RS Praveen Kumar | మీరు కాంగ్రెస్ నాయకుడైతే రికార్డులు లేకున్నా నష్టపరిహారం తీసుకోవచ్చు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Horrific incident | దారుణం .. ముగ్గురు ఆడపిల్లలను సంపులో పడేసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ తల్లి
Mental Health | మానసిక లేదా శారీరక క్షోభను ఒక తరం అనుభవిస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపిస్తుందా..?
Harish Rao | కేసీఆర్ పాలనలో వలసలు తిరుగుముఖం.. రేవంత్ పాలనలో ఎడ్లబండ్లపై బలవంతపు వలసలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

