తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గత కొన్నేండ్లుగా పెద్ద కాంక్రీట్ మోరీలు (సిమెంట్ డ్రైనేజీ పైపులు) వాహనదారులకు, స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తెచ్చి వేసిన ఈ సిమెంట్ పైపులను రోడ్డు పక్కన పడేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా...
– ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు, వాహనదారులు
తుంగతుర్తి, అక్టోబర్ 28 : తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై గత కొన్నేండ్లుగా పెద్ద కాంక్రీట్ మోరీలు (సిమెంట్ డ్రైనేజీ పైపులు) వాహనదారులకు, స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తెచ్చి వేసిన ఈ సిమెంట్ పైపులను రోడ్డు పక్కన పడేసి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు గానీ, గ్రామ సర్పంచ్, కాంట్రాక్టర్ గానీ పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారిపై నిత్యం వేలాది వాహనాలు, కాలినడకన వెళ్లే బాటసారులు ప్రయాణిస్తుంటారు. రోడ్డులో సగం భాగాన్ని ఆక్రమించేలా ఈ పైపులు పడేయడంతో తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా రాత్రి వేళల్లో సరిపడా వీధిదీపాలు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు వీటిని గమనించక ఢీకొట్టి ప్రమాదాల బారిన పడుతున్నారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మండల కేంద్రానికి చెందిన గణేష్ అలాగే కార్తీక్ అనే ఇద్దరు యువకులను వాహనదారులు ఢీకొట్టడంతో తీవ్రగాయాలపాలయ్యారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం వాటిల్లితే తప్ప స్పందించరా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్బీ అధికారులు వెంటనే స్పందించి, ప్రమాదకరంగా ఉన్న ఈ సిమెంట్ పైపులను ఇక్కడి నుండి తొలగించాలని లేదా నిలిచిపోయిన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

