ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్ల పంపిణీ
సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ట్రాఫిక్ విధులను..
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 10 : సూర్యాపేట, కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి శుక్రవారం జిల్లా ఎస్పీ కె.నరసింహ చలువ కళ్లద్దాలు, సమ్మర్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో ట్రాఫిక్ విధులను నిర్వర్తించే ట్రాఫిక్ సిబ్బంది ఎండ వేడిమి నుండి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరి పనితీరు గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా రోడ్లపై విధులు నిర్వర్తించేటప్పుడు తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే విధంగా ఈ కిట్లను అందజేయడం జరిగిందన్నారు.
విధుల పరంగానైనా, వ్యక్తిగతంగానైనా ఎలాంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఎండ వేడిమి నుండి ఎప్పటికప్పుడు తమను తాము సంరక్షించుకోవాలంటే ఎక్కువగా నీళ్లు త్రాగాలన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై నిత్యం ప్రజలకు అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకై భాద్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహచారి, సీఐలు వెంకటయ్య, శివశంకర్, రిజర్వ్ సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు సాయిరాం, అంజిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

