రామగిరి, అక్టోబర్ 1: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సిద్ధ్దమయ్యారు. అన్ని ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించేందుకు భక్తులు మండపాలను సిద్ధం చేశారు. ఈ నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలు సాగనుండగా గురువారం మండపాల్లో అమ్మవారు కొలువుదీరనున్నారు.
నల్లగొండ జిల్లాకేంద్రంలో రాక్హిల్స్కాలనీలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించే ఏర్పాట్లు చేశారు. మరోవైపు దేవీ నవరాత్రి ఉత్సవాలకు నల్లగొండలోని అమ్మవారి ఆలయాలు ముస్తాబయ్యాయి. తులసీనగర్లోని భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని సరస్వతి, మహాలక్ష్మీ ఆలయంతోపాటు పాతబస్తీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత గుడి, కలెక్టరేట్ సమీపంలోని అయ్యప్ప దేవాలయంలో గల జ్ఞాన సరస్వతి ఆలయం, పానగల్, హైదరాబాద్ రోడ్డులోని మర్రిగూడ స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
ఉత్సవాలు ఇలా..