టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ర్యాంకులు సాధించే విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు...
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రకటన
– బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్
రామగిరి, అక్టోబర్ 24 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడ కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ప్రథమ ర్యాంకులు సాధించే విద్యార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సొంత ఖర్చులతో ఢిల్లీ పర్యటనకు తీసుకెళ్లనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ప్రకటించారు. విమాన ప్రయాణ ఖర్చులతో పాటు ఇతర వసతులు, షాపింగ్ ఖర్చులను కూడా మంత్రి స్వయంగా భరిస్తారని, ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అద్భుతమైన అవకాశం కల్పిస్తారని కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
శనివారం కలెక్టర్ బి.చంద్రశేఖర్ బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ముఖాముఖి: 7వ తరగతి విద్యార్థులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్.. ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, చదువులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఉపాధ్యాయులు బాగా బోధిస్తున్నారని, తమకు ఎలాంటి సమస్యలు లేవని విద్యార్థులు ఆనందంగా బదులిచ్చారు. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. రిఫ్లెక్షన్, నాన్రిఫ్లెక్షన్కు సంబంధించిన అంశాలపై ప్రశ్నించగా, విద్యార్థులు బోర్డుపై చక్కగా సమాధానాలు వివరించడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ రామాచారి, ఎంఈఓ అరుంధతి, ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్, సుధారాణి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

