రామగిరి, మే 14 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బుధవారం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 6వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్.. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు జరిగాయి. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్‌కు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6,007మంది విద్యార్థులకు 5,689మంది హాజరయ్యారు. 317మంది గైర్హాజరయ్యారు.
దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా ఆ పరీక్ష కేంద్రం స్కాడ్ డిబార్ చేశారు. మధ్యాహ్నం జరిగిన సెమిస్టర్ 1 బ్యాక్లాగ్ పరీక్షకు 1,176మందికి 1,015మంది హాజరయ్యారు. 161మంది గైర్హాజరయ్యారు. నల్లగొండలోని పలు పరీక్ష కేంద్రాలను ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, సీఓఈ జి.ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ పరీక్షల నియంత్రణాధికారి లక్ష్మీప్రభ పర్యవేక్షించారు.