‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వల్ల రైతులు యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కట్టంగూర్ వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ సూచించారు. ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో..
కట్టంగూర్, నవంబర్ 05 : ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వల్ల రైతులు యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని కట్టంగూర్ వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ సూచించారు. ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో ఎల్‌నినో పరిస్థితులు, భూ సంరక్షణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి గిరిప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
యాసంగిలో వరి సాగు వల్ల అధికంగా నీరు అవసరమవుతుందని, అందువల్ల రైతులు పరిస్థితులకు అనుగుణంగా శనగ, పెసర, మినుము, నువ్వులు, జొన్న, వేరుశనగ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనకాల వాణి కేశవులు, ఏఈఓ నవీన్, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రత్యామ్నాయ పంటల సాగుతో రైతులకు మేలు’
Vaikuntha Ekadashi | డిసెంబర్ 20 నుంచి తిరుమలలో ‘ వైకుంఠ ఏకాదశి ’ ద్వార దర్శనాలు
Gangula Kamalakar | కేసీఆర్ బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడితే.. రేవంత్ రెడ్డి చీకటి జీవో జారీ చేసిండు : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
‘మైనార్టీ మహిళలకు ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగ అవకాశాలు’
SI Krishna Reddy | తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టిని సారించాలి : ఎస్సై కృష్ణారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

