కోదాడ, జూన్ 19 : గత 40 సంవత్సరాలుగా మున్సిపాలిటీ పక్కన చిరు వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకున్న డబ్బా కొట్లను అధికారులు బలవంతంగా తొలగించాలని చూస్తే ఆందోళన చేపడతామని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. గురువారం కోదాడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటికే కొట్లను తొలగించరాదని హైకోర్టు నుంచి ఆదేశాలు కూడా జారీ అయినట్లు తెలిపారు. నిరుపేదలైన చిరు వ్యాపారస్తులు గత కొంతకాలంగా మున్సిపాలిటీకి పన్నులు కూడా చెల్లిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారులు బెదిరింపులు మానుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఎస్కే.నయీమ్, బొలిశెట్టి కృష్ణయ్య, మేకల శ్రీనివాసరావు, ఎస్డీ.ముస్తఫా, వేలాద్రి, దొంగరి శీను, కర్ల సుందర్రావు, అబ్దుల్ రహీం, సింహాచలం, గోపాలకృష్ణ, ఆరిఫ్, పుల్లయ్య, చిరు వ్యాపారస్తులు పాల్గొన్నారు.