‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
వర్షాభావం, విద్యుత్ కోతల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు...
– తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్
కోదాడ, అక్టోబర్ 12 : వర్షాభావం, విద్యుత్ కోతల కారణంగా దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.30,000 చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లు ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రైతు సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు దొడ్డ వెంకటయ్య, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, రైతు సంఘాల నాయకులతో కలిసి ఆర్డీవో సూర్యనారాయణను కలిసి వినత పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులందరికీ ఎకరాకు రూ.30 వేల పరిహారం అందించడంతో పాటు కౌలు రైతులకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేసి పంట నష్ట పరిహారాన్ని వారికే నేరుగా అందేలా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని (ఫసల్ బీమా) సక్రమంగా అమలు చేయాలని, సాగర్ ఎడమ కాల్వకు కోతలు పూర్తయ్యేంత వరకు నీటిని విడుదల చేయాలని చివరి భూముల వరకు సాగునీరు అందేల చూడాలని కోరారు. ప్రభుత్వం యాసంగి పంట వేయ్యోద్దంటున్నందుకు ఎకరానికి రూ.30,000 ఇవ్వాలని, మున్సిపాలిటీ గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసి వ్యవసాయ కార్మికులకు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, గోపాల్ , గొట్టెముక్కల కోటి నారాయణ, వెంకటరావు, కనగాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

