మేళ్లచెర్వు, మార్చి 7 : స్థానిక స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజుల పాటు జరుగనున్న మహా శివరాత్రి జాతర ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ గురువారం పరిశీలించారు. భక్తులకు తాగునీరు, శానిటేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయం వెలుపల ఉన్న క్యూలైన్లను పరిశీలించి టికెట్ రేట్లను ఆరా తీశారు.
ఎద్దుల పందేలు, కబడ్డీ పోటీలు జరిగే ప్రాంతాలను, ఎన్ఎస్పీ కాల్వలో నీటిని పరిశీలించారు. అంతకుముందు మై హోం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్స కేంద్రం, వాటర్ స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఆయన వెంట సీఈఓ అప్పారావు, హుజూర్నగర్ ఆర్డీఓ శ్రీనివాసులు, తాసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ అజ్గర్‌అలీ, ఆలయ ఈఓ కొండారెడ్డి, చైర్మన్ శంభిరెడ్డి, సభ్యులు, పలు శాఖల అధికారులు ఉన్నారు.
మేళ్లచెర్వు శివరాత్రి జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సిబ్బందికి సూచించారు. స్థానిక కస్తూరి వేంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ట్రైనీ ఐపీఎస్ రాజేశ్మీనాతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
సీసీ కెమెరాలతో పాటు 500 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణలో పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నాగేశ్వర్రావు, జనార్ధన్‌రెడ్డి, కోదాడ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.