రామగిరి, జూన్ 20 : నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల నోటీస్ బోర్డులో పొందుపర్చిన వివరాలను, కోర్సులు, విద్యార్థుల వివరాలను ప్రిన్సిపాల్ సుధారాణిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థినులతో మామేకమైన సబ్జెక్ట్ వివరాలు అడిగి తెసుకున్నారు.
అనంతరం విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందేలా చక్కటి మోటివేషన్ పాఠ్యాంశాలను బోధించి అందరిని అబ్బుర పరిచారు. అనంతరం కళాశాల ఆవరణను పరిశీలించి కావాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. 2024-25లో కళాశాల టాపర్స్‌గా నిలిచిన విద్యార్థినులు సూఫియా (సీఈసీ 485), శీరిష (హెచ్ఈసీ 475), రిషి (ఎంపీసీ 458), స్వాతిక, తహుర ఫిరదౌసి (బైపీసీ 410) కు బహుమతులు అందచేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.
Nalgonda : విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి పాఠాలు