3లోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి
జిల్లాలో సర్ ప్రక్రియను ఆగస్టు 3లో గా వందశాతం పూర్తి చేయాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు.
- నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
నీలగిరి, జూలై 16: జిల్లాలో సర్ ప్రక్రియను ఆగస్టు 3లో గా వందశాతం పూర్తి చేయాలని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తయిందని, రానున్న నాలుగు నుంచి 5 రోజుల్లో దీనిని 92 శాతానికి పెంచాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం సర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో వంద శాతం మ్యాపింగ్, డిజిటలైజేషన్ పూర్తి చేసేలా పార్టీలు, బూత్ స్థాయి ప్రతినిధులకు సహకరించాలని కోరారు.
జిల్లాలో ఇప్పటివరకు 10 లక్షల మ్యాపింగ్‌లు పూర్తయ్యాయని, మరో 54 వేల మ్యాపింగ్‌లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇంకా 344 ఓటర్లను గుర్తించాల్సి ఉందన్నారు. బుధవారం నాటికి పెండింగ్ మ్యాపింగ్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయి తే డబుల్ ఓటింగ్‌కు అవకాశం తగ్గుతుందన్నారు. ప్రజాప్రతినిధులు కూడా ఇంటింటికి వెళ్లి పేర్లు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి క్వాలిటీ అధికారులను నియమించి వెరిఫికేషన్ నిర్వహిస్తున్నామని, మరో 5 రోజుల్లో జిల్లాలో 92 శాతం మ్యాపింగ్ పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముంతాజ్ అలీ, బక పిచ్చయ్య, పుచ్చకాయల నర్సిరెడ్డి, లింగస్వామి, అన్సారి, అన్నా రవి, రఫీ, రవిశంకర్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

