– హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ వద్దిరాజు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు
– కేసీఆర్, కేటీఆర్ ఆశీస్సులు
నల్లగొండ, ఏప్రిల్ 20 : నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదినం వేడుకలు సోమవారం నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అతిథిగా హాజరై చిరుమర్తిని శాలువాతో సత్కరించి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు హాజరై చిరుమర్తికి శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు
అంతకుక్రితం చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినం సందర్భంగా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నందు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్‌ను కలిసి ఆశీస్సులు పొందారు. అలాగే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును కలిసి ఆశీస్సులు పొందారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు