నల్లగొండ రూరల్, ఏప్రిల్ 1: పౌల్ట్రీ యజమానులు సిండికేట్‌గా మారి ట్రేడర్లకు, చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడంతో తాము తీవ్రం గా నష్టపోతున్నామంటూ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో తలపెట్టిన చికెన్ షాపుల బంద్‌కు మద్దతుగా నల్లగొండ చికెన్ షాప్స్ ఓనర్స్, ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాల నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 126 దుకాణాలను పూర్తిగా బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా నల్లగొండ చికెన్ ట్రేడర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు జిట్టబోయిన ఆంజయ్య, అధ్యక్షుడు ఉప్పరి నరసింహా ముదిరాజ్, చికిన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వింజమూరి లక్ష్మణ్ మాట్లాడుతూ రోజుకో విధంగా పౌల్ట్రీ కంపెనీలు చికెన్ ధర నిర్ణయిండంతో తాము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యజమానులతో ప్రభుత్వ చర్చలు జరిపి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్జిన్‌ను సరిచేసే వరకు బంద్ కొనసాగుతుందన్నారు. 28 పెద్ద కంపెనీల్లో వెన్‌కాబ్, స్నేహా కంపెనీలు లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు.
గతంలో రైతుల నుంచి నేరుగా కోళ్లు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడ పెద్ద కంపెనీలు సిం డికేట్‌గా మారి కోడి పిల్లలను ఇచ్చి వాటిని పెంచి వాళ్లే ధరను నిర్ణయిస్తున్నారన్నారు. కార్పొరేట్ వ్యవస్థను వారు తమ చేతుల్లోకి తీసుకోవడంతో చికెన్ సెంటర్ యాజమానులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. గతంలో 30 నుంచి 40 మార్జిన్ ఇచ్చే వారు ప్రస్తుతం రూ.10 కూడా ఇవ్వకపోవడంతో చికెన్ షాపులు నడపలేక పోతున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5500 చికెన్ షాపులను మూసివేనట్లు తెలిపారు. కార్యక్రమంలో సం ఘం ఉపాధ్యక్షుడు ముంత శ్రీను, కోశాధికారి కట్లకుంట్ల శ్రీశైలం, కట్ల సైదులు, సలీమోద్దీన్, కట్ల యాదయ్య, బెల్లి రవి, వీరమళ్ల కనకయ్య, పల్లా లింగయ్య, ఉప్పరి వెంకన్న, లింగస్వామి, ఉమైద్, ఆహ్మద్, యాకూబ్ పాల్గొన్నారు.
పేటలో చికెన్ సెంటర్లు బంద్
సూర్యాపేట, ఏప్రిల్ 1: పౌల్ట్రీ యజమానులు సిం డికేట్‌గా ఏర్పడి చిన్న దుకాణాలకు ఇచ్చే మార్జిన్‌ను తగ్గించడంతో తీవ్రంగా నష్టపోతున్నామం టూ సూర్యాపేట పట్టణంలోని చికెన్ సెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చికెన్ షాపులు బంద్ పెట్టి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి మాట్లాడుతూ పౌల్ట్రీ యజమానులు రోజుకో విధంగా చికెన్ ధర నిర్ణయించడంతో ఇబ్బందులు పడుతున్నామని, వినియోగదారుల తో మాటలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పౌల్ట్రీ యజమానులతో ప్రభుత్వం చర్చలు జరిపి న్యాయం చేయాలన్నారు.
సంఘం గౌరవాధ్యక్షుడు ఎస్కే అఫ్జల్ మాట్లాడుతూ కార్పొరేట్ పౌల్ట్రీ ఫాంలు తమ బాధను అర్థం చేసుకొని గతం లో ఇచ్చిన మాదిరిగానే మార్జిన్ ఇచ్చి వ్యాపారాలు సజావుగా సాగేలా సహకరించాలన్నారు. వినియోగదారులు కూడా జరుగుతున్న పరిణామాలను, చికెన్ దుకాణ యజమానులు ఎదుర్కొంటున్న పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీవీరెడ్డి, సైదు లు, కిరణ్‌రెడ్డి, ఎజాజ్, ఇంతియాజ్, మణికంఠ అనంతు, ఆయూబ్‌ఖాన్, రాయల్ మాలిక్, ఆర్ఆర్ వెంకటేశ్, రేష్మాఫరీద్, రాజు పాల్గొన్నారు.