నేరేడుచర్ల, జూలై 19 : ఆగస్టు 13న హైదరాబాద్లో జరిగే చేయూత పెన్షన్ దారుల మహా గర్జనను విజయవతం చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత సతీశ్ అన్నారు. శనివారం నేరేడుచర్ల పట్టణంలో ఎమ్మార్పీఎస్ మండలాధ్యక్షుడు యడవెల్లి అరుణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ.6 వేలు ఫించన్ ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు రూ.4 వేల ఫించన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆగస్టు 13న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే మహా గర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిది పీరెల్లి బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్, నాయకులు లక్ష్మణరావు, వెంకటయ్య, ప్రదీప్, గోపి, శివ, అబ్బాస్, వేణు, సతీశ్, ప్రభాకర్ పాల్గొన్నారు.