నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి అనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార సరళి తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, గుజ్జ దీపిక, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, రాంచందర్‌నాయక్, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, చెరుకు సుధాకర్, కటికం సత్తయ్యగౌడ్, గుజ్జ యుగంధర్‌రావు, సూర్యాపేట జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్ పాల్గొన్నారు.