చౌటుప్పల్, జూన్ 23 : చౌటుప్పల్ సింగిల్ విండో పాలకవర్గాన్ని జిల్లా సహకార అధికారి ప్రవీణ్‌కుమార్ రద్దు చేయడం సరికాదని మాజీ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి అన్నారు. పాలకవర్గం రద్దును నిరసిస్తూ ఆదివారం సింగిల్‌విండో కార్యాలయం ఎదుట మాజీ డైరెక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ సర్వసభ్య సమావేశాలు పెట్టలేదనడం సరైంది కాదని, విచారణ లేకుండా పాలకవర్గాన్ని రద్దు చేశారని అన్నారు. గతంలో 5సార్లు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశామని, కరోనా సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సమావేశాలు పెట్టలేదని తెలిపారు. కావాలనే అనవసర సాకులు చూపి పాలకవర్గాన్ని రద్దు చేశారన్నారు. కమిటీ రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్ను పర్సనల్ ఇన్చార్జిగా, బీజేపీకి చెందిన నలుగురిని, సీపీఎం నుంచి ఒకరిని డైరెక్టర్లుగా నియమించారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్మన్‌ను, ఆరుగురు డైరెక్టర్లను తొలగించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా వ్వవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్, డైరెక్టర్లు దుబ్బాక శశిధర్‌రెడ్డి, పబ్బతి వెంకటయ్యగౌడ్, దొడ్డి శ్రీశైలం, సూరానాయక్, మాజీ జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, నాయకులు సుర్వి మల్లేశ్ గౌడ్, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేశం గౌడ్, గుండెబోయిన వెంకటేశం యాదవ్, కొత్త పర్వతాలు యాదవ్ పాల్గొన్నారు.