పెన్పెహాడ్, జూలై 26 : బీఆర్ఎస్ నాయకుడు, చీదేళ్ల మాజీ సర్పంచ్, కాకతీయ గ్రూప్ విద్యాసంస్థల చెర్మన్ పరెడ్డి సీతారాంరెడ్డి జన్మదిన వేడుకలను శనివారం పెన్పహాడ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బసిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు బుక్స్, పెన్నులు, క్రీడా సామగ్రి పంపిణీ చేశారు. అనంతరం కాసరబాద్ రోడ్ లో ఉన్న అపూర్వ అంధుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు దొంగరి యూగేందర్, మాజీ ఎంపీపీ నెమ్మది భిక్షం, సింగిల్ విండో చెర్మన్ వెన్న సీతారాం రెడ్డి, నాతల జానకి రాంరెడ్డి, అనంతుల శ్రీనివాస్, దంతాల వెంకటేశ్వర్లు, పొదిలా నాగార్జున, చెన్నూ శ్రీనివాస్ రెడ్డి, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బోలక బొబ్బయ్య, కట్ల నాగార్జున, మీసాల లింగయ్య పాల్గొన్నారు.