భారీ వర్షాలకు జిల్లాలో రోడ్లు అధ్వానంగా, అస్తవ్యస్తంగా మారాయి. వరుసగా కురిసిన వానలకు గ్రామీణ రోడ్లతో పాటు రాష్ట్ర, జా తీయ రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో ఎకడ చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంత లు పడి, వర్షపు నీరు నిలిచి బురదమయం గా దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా గుంతలమయమయ్యాయి. ప్రభుత్వం మాత్రం కనీసం మరమ్మతు కూడా చేపట్టడం లేదు. తాతాలికం, శాశ్వత మరమ్మతుల ఊసే లేదు. జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆగమైన రోడ్లపై ప్రయాణించడానికి ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లోని చెరువులు, కుంటలు, కల్వర్టులు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఆర్అండ్బీ విభాగం పరిధిలో 4.25 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. 30 మీటర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. 9 కల్వర్టులు కొట్టుకుపోయాయి.
తాతాలిక మరమ్మతుల కింద రూ.40 లక్షలు, శాశ్వత రిపేర్లకు రూ.2.18 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3.1 కిలోమీటర్లు కొట్టుకుపోగా, రెండు చోట్ల పూర్తిగా ధ్వంసమైంది. ఎనిమిది కల్వర్టులు దెబ్బతిన్నాయి. 16 చెరువులు దెబ్బతినగా, ఎనిమిది చెరువులకు గండ్లు పడ్డాయి. ఇవీ కేవలం అధికారికంగా తెలిపిన గణంకాలు మాత్రమే. వీటిలో కొన్ని చోట్ల మాత్రమే అరకొర మరమ్మతులు చేసి చేతులు దులిపేసుకున్నారు.
అడుగడుగునా గుంతలు
భారీ వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. అందులో నీళ్లు నిలిచి బురదతో నిండిపోయాయి. కొన్ని చోట్ల నీళ్లు నిలవడంతో రహదారులు చిత్తడిగా దర్శనమిస్తున్నాయి. కొన్ని తండాలకు, గ్రామాలకు వెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాలు వదిలేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. చీకట్లో వాహనాలను తోలడం చాలా కష్టంగా మారిందని , దీంతో ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.
గ్రామాల్లోనూ రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. భూదాన్ పోచంపల్లి మండలం గౌస్‌కొండ గ్రామం నుంచి పెద్ద రావులపల్లి వరకు గల రోడ్డంతా గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. పోచంపల్లి, రేవన పల్లి, ముక్తాపూర్, గౌస్‌కొండ గ్రామాల ప్రజలకు భువనగిరి వెళ్లడానికి ఇదే ప్రధానం మార్గం. గౌస్‌కొండ చెరువు కట్ట మూలమలుపు, మైసమ్మ గుండు, దర్గా సమీపం, పెద్ద రావులపల్లి గ్రామ శివారులో పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల కుంటకు గండి పడి వరట్పల్లి, నేలపట్ల రహదారి పాడైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలి
ఎప్పుడు వర్షాలు పడినా రత్నాల వాగు, ఈదుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామానికి రావాలంటే ఇబ్బంది. గతంలో రాత్రిపూట భారీ వర్షాలు పడడంతో ఆలేరు నుంచి సైకిల్‌పై మంతపురికి వె ళ్తున్న క్రమంలో చిక సిద్ధిరాములు రత్నాల వాగు లో కొట్టుకుపోయి మరణించారు. ఎమ్మెల్యే, కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినా బ్రిడ్జిని హైలెవెల్ చేద్దామన్న హామీ నేటికీ అమలు కు నోచుకోలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి హైలె వెల్ బ్రిడ్జి నిర్మించాలి.
– కుండే సంపత్, బహదూర్ పేట, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి