నాగారం, మార్చి 19 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాగారం మండల కేంద్రం నుంచి నిర్వహించే బైక్ ర్యాలీని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాగారం మండలాధ్యక్షుడు కల్లెట్లపల్లి ఉప్పలయ్య పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆదేశానుసారం గురువారం ఉదయం 9 గంటలకు నాగారం మండలం నుంచి సూర్యాపేటకు బైక్ ర్యాలీ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే పార్టీ భారీ బహిరంగ సభతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమావేశంలో కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. కావునా పార్టీ మండల ముఖ్య నాయకులు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యూత్ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.