భువనగిరి ఓటర్లు @ 18,08,585
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల లెక్క తేలింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లు అనే వివరాలను రిటర్నింగ్ అధికారి హన్మంతు కె.జెండగే వెల్లడించారు.
- తేలిన పార్లమెంట్ ఓటర్ల వివరాలు
- పురుషుల కంటే స్వల్పంగా మహిళలు అధికం
- సగం మందికి పైగా 40ఏండ్లలోపు వారే
- వందేండ్ల పైబడినోళ్లు 180 మంది
- ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా ఓటర్లు
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల లెక్క తేలింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది ఓటర్లు అనే వివరాలను రిటర్నింగ్ అధికారి హన్మంతు కె.జెండగే వెల్లడించారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 18,08,585 ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. 8,98,416మంది పురుషులు, 9,10,090 మంది స్త్రీలు, 79 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,39,341మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత మునుగోడులో 2,57,557, భువనగిరిలో 2,20,596, నకిరేకల్‌లో 2,53,785, తుంగతుర్తిలో 2,59,265, ఆలేరులో 2,35,270, జనగాంలో 2,42,771 ఓటర్లు ఉన్నారు.
40 ఏండ్లలోపు 9,29,325 ఓటర్లు
పార్లమెంట్ పరిధిలోని మొత్తం ఓటర్లలో సగం మందికి పైగా యువ ఓటర్లే ఉన్నారు. 40 ఏండ్లలోపు 9,29,325 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఇక 40 నుంచి 99 ఏండ్లలోపు 8,79,090 మంది ఓటర్లు ఉన్నారు. ఇక వందేండ్లకు పైగా 180 మంది ఉన్నారు. ఇందులో వంద నుంచి 109 ఏండ్ల మధ్య 143 మంది, 110 నుంచి 119 మధ్య 14 మంది, 120కి పైగా 23 మంది వృద్ధులు ఉన్నారు. వృద్ధుల ఓటు నమోదు కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

