యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలి
తెలంగాణకు తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు డిమాండ్ చేశారు.
- భూనిర్వాసితుల హకుల కోసం బీఆర్ఎస్ పోరాటం
- కార్పొరేట్ శక్తులకు ప్రజా ఆస్తులను కట్టబెడితే ఊరుకోం
- మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
మిర్యాలగూడ, జూన్ 12: తెలంగాణకు తలమానికమైన యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు ధారాదత్తం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక ఆలోచనలను తక్షణమే విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తూ శుక్రవారం మిర్యాలగూడలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి మొదటిసారి తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాలంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో విద్య, పారిశ్రామిక అభివృద్ధిని కాంక్షిస్తూ చేసిన ప్రత్యేక విజ్ఞప్తికి మాజీ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. నియోజకవర్గానికి పెద్దపీట వేస్తూ అప్పట్లోనే సుమారు రూ.30 వేల కోట్లతో మెగా థర్మల్ పవర్ ప్లాంట్‌ను మంజూరు చేశారని చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మాత్రమే కాదని, స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక మహత్తరమైన జీవనాధారమని స్పష్టం చేశారు. నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలకులు ఈ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయడానికి అడుగులు వేయడమంటే రాష్ట్ర సంపదను లూటీ చేయడమేనని మండిపడ్డారు. ప్లాంట్ నిర్మాణ సమయంలో ఇకడి రైతులు, గిరిజనులు సర్వ స్వం కోల్పోయి ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి ప్రధాన కారణం తమ పిల్లల భవిష్యత్ బాగుంటుందనే నమ్మకమే అన్నారు. నాడు భూసేకరణ సమయంలో రాష్ట్రంలో ఎకడా లేని విధంగా నిర్వాసితులకు గరిష్ట న్యాయం జరిగేలా చూశామని భాసర్‌రావు అన్నారు.
ఒక గిరిజన రైతుకు కూడా నష్టం జరగకుండా భూములను సేకరించామని వివరించారు. ప్రభుత్వం హడావుడిగా కొద్దిమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి చేతులు దులిపేసుకుందని, ఇం కా అర్హులైన సుమారు 700 మంది భూనిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. కుటుంబంలో మగవారు లేని పక్షంలో ఆడ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని బేఖాతరు చేస్తూ అర్హులైన యువతులను పకన పెట్టడం దారుణమన్నారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్వాసితుల జీవితాలను అంధకారంలోకి నెట్టే ఏ ప్రయత్నాన్నైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజాశక్తితో అడ్డుకుంటుందని హెచ్చరించారు. మిగిలిన 700 మందికి తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని, లేదంటే ప్రజలను ఏకం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు ఎండీ యూసుఫ్, కుందూరు వీరకోటిరెడ్డి, రాయికింది సైదులు, సోము సైదిరెడ్డి, గుగులోత్ వీరబాబు, కొండారపు బ్రదర్స్, కందుల నాగిరెడ్డి, కొనకంచి సత్యనారాయణ, బైరం గోపి, కోటయ్య, నర్సయ్య, రామావత్ వినోద్ నాయక్, బంగారు సైదిరెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

