రామగిరి, జూన్ 17 : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను సోమవారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈద్గాలు, మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
మిర్యాలగూడలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సూర్యాపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మత గురువులు బక్రీద్ ప్రత్యేకతను, ఖురాన్‌లోని విషయాలను వివరించారు.