పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్లే వ్యాధులు సంక్రమిస్తాయని మలేరియా నివారణ హైదరాబాద్ జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్‌కుమార్ అన్నారు. ఇందుగుల గ్రామంలో జ్వర బాధితుల ఇండ్లకు శనివారం వెళ్లి పరామర్శించారు. వీధుల్లో నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ చల్లించారు. ఇంట్లో నిల్వ ఉన్న నీటిని పారబోశారు.
ప్రజలు అధైర్య పడొద్దని, మెరుగైన వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామంలో ఇప్పటి వరకు పది డెంగీ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంట మలేరియా నివారణ వరంగల్ జోనల్ ఆఫీసర్ నాగయ్య, డీఎంఓ దుర్గయ్య, పీహెచ్సీ డాక్టర్ ఇక్తియార్, ఫిర్దోస్ ఉన్నారు.