కేతేపల్లి, ఆగస్టు 21 : సృజనాత్మక ఆలోచనతోనే కళాత్మక బొమ్మలు సాధ్యం అని ప్రభుత్వ పాఠ్య పుస్తక కార్టూనిస్ట్, జాతీయ అవార్డు గ్రహీత వడ్డేపల్లి వెంకటేశ్ అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బొమ్మలు ఎలా వేయాలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొమ్మలు గీయాలనే ఆలోచన ప్రతి విద్యార్థికి ఉంటుందన్నారు. సరైన మెళకువలతో బొమ్మలు అందరూ వేయొచ్చు అన్నారు. బొమ్మలు వేయడం నేర్చుకోవడం వల్ల చక్కని చేతి రాత సైతం అలవడుతుందన్నారు. మంచి మార్కులు రావడానికి ఇది దోహద పడుతుందని తెలిపారు.
ఇంగ్లీష్, తెలుగు అక్షరాలు, అంకెలతో బొమ్మలు గీసి చూపించారు. బొమ్మలతో కథలను కూడా చెప్పొచ్చన్నారు. కథలు ఎలా రాయాలో విద్యార్థులకు వివరించారు. అనంతరం వడ్డేపల్లి వెంకటేశ్‌ను ఉపాధ్యాయులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాపోలు పరమేశ్, పాఠశాల ఇన్చార్జి బత్తుల జానకి రెడ్డి, గుమ్మడవల్లి రమేశ్, కన్నె శివయ్య, పీడీ దోరెపల్లి నాగయ్య, జూనియర్ అసిస్టెంట్ సుమన్, అటెండర్ అహ్మద్ పాల్గొన్నారు.
kethepally : సృజనాత్మక ఆలోచనతో కళాత్మక బొమ్మలు : ప్రముఖ కార్టూనిస్ట్ వడ్డేపల్లి వెంకటేశ్