నార్కట్పల్లి, జూన్ 09 : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు సోమవారం రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. చెర్వుగట్టు దేవస్థానానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు వస్తుంటారని, చెర్వుగట్టు ఆర్చి రద్దీ ప్రదేశం కావడంతో బ్రిడ్జి నిర్మాణం లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కుమ్మరి శంకర్, దండు రవి, మేడి వాసుదేవ్, మేడి అశోక్, దండు నాగరాజు, అంతటి సత్యనారాయణ, బొల్లెద్దు సైదులు, దండు శంకర్, లింగయ్య, రేగట్టె సతీశ్, నల్ల చంద్రశేఖర్, దండు శివశంకర్, బోయపల్లి శివ, చిక్కుల్ల లింగస్వామి, బోయపల్లి హరిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.