‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
రాబోయే ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకుడు మట్టిపల్లి వెంకట్ యాదవ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో...
తుంగతుర్తి, అక్టోబర్ 28 : రాబోయే ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకుడు మట్టిపల్లి వెంకట్ యాదవ్ కోరారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని పట్టభద్రులు తమ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని సూచించారు. డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండి ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తయిన ప్రతీ ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం-18 ను పూర్తి చేసి సంబంధిత విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో ఆన్లైన్లో లేదా నిర్దేశిత కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు వేయాలని కోరారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
Lice | పిల్లలకు తలలో పేలు ఎలా ఏర్పడుతాయి.. తొలగేందుకు ఏం చేయాలి..?
Laxma Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

