రామగిరి, జూన్ 13 : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ తెలుగు మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్ ఆధునిక కవిత్వం పాఠ్యాంశాల్లో నల్లగొండ పట్టణంలోని మాన్యంచెల్క నివాసి అలీ రాసిన “పాన్ మరక” కవితకు చోటు లభించిందని అకడమిక్ తెలుగు కౌన్సిలర్, కవి, రచయిత పున్నమి అంజయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలీ రాసిన “పాన్ మరక” కవితలో జీవం, జీవితం ఉన్నదని, అందుకే ఆయన కవితకు పీజీ తెలుగు పాఠ్యాంశాల్లో చోటు దక్కడం జిల్లాకే గర్వకారణం అన్నారు. అలీతో పాటు ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఎన్.గోపి రాసిన ‘రొట్టె’ , సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘నాలుగో కన్ను’ కవితలకు కూడా ఇందులో స్ధానం కల్పించినందుకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి కృతజ్ఞతలు తెలియజేశారు.