నూతనకల్, జులై 10 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కూకట్పల్లిలో కల్తీ కల్లుకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గీత పనివారాల సంఘం సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తొట్ల ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నూతనకల్ మండల కేంద్రంలో గీత పనివారల సంఘం నూతన మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ కల్లు తాగి ఆరుగురు చనిపోగా మరికొంత మంది అస్వస్థకు గురికావడం బాధాకరమన్నారు. కల్లును కల్తీ చేయడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని తెలిపారు.
కల్తీ కల్లుకి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నూతనకల్ సొసైటీ అధ్యక్షుడు బూడిది సైదులు గౌడ్, ముగుళ్ల వెంకన్న గౌడ్, బండపల్లి శ్రీను గౌడ్, మారగోని వెంకన్న గౌడ్, మొగుల వెంకన్న గౌడ్, బూడిద రవి, ముత్యం మల్సురు, మద్దెల సురేందర్, బండపల్లి శ్రీరాములు పాల్గొన్నారు.