రామగిరి, ఆగస్టు 15 : 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ , జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్యలతో కలిసి మహాత్మా గాంధీ, అంబేదర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు. అనంతరం రవీంద్ర కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్‌యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, బక పిచ్చయ్య, కాంచనపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీపీ ఎసే కరీంపాషా, పట్టణ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, కనగల్ మండల పార్టీ అధ్యక్షుడు అయితగోని యాదయ్య, కనగల్, ఎడవెల్లి సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి దోటి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్ రెడ్డి, సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, ఊటూరు సందీప్ రెడ్డి, పొనుగోటి జనార్దన్ రావు, కత్తుల సంజీవ, మైనార్టీ నాయకులు అన్వర్‌పాషా, కౌకూరి వీరాచారి, షరీఫ్, కడారి కృష్ణయ్య కోట్ల జయపాల్ రెడ్డి, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, ఊటూరు సునందరెడ్డి, దొడ్డి రమేశ్, పేర్ల అశోక్, పెరిక యాదయ్య, కంకణాల వెంకట్‌రెడ్డి, గాలి రాధిక, విద్యార్థి నాయకులు బొమ్మరబోయిన నాగార్జున, అంబటి ప్రణీత్, రవీంద్రచారి ఉన్నారు.
సూర్యాపేట, ఆగస్టు 15: అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని, స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికీ అందించేందుకు కృషి చేస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రిగా పదేండ్లు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపారని గుర్తు చేశారు. తామెప్పుడు ప్రజల కోసమే పని చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జడ్పీటీసీ జీడీ భిక్షం, మాజీ ఎంపీపీ నెమ్మాది భిక్షం, పట్టణ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, ఆకుల లవకుశ, బత్తుల రమేశ్, బొలిశెట్టి మధు, తూడి నర్సింహారావు, బైరు వెంకన్న, కెక్కిరేణి నాగయ్య, మద్దెల వీరస్వామి, చింతలపాటి మదు, బొమ్మగాని శ్రీనివాస్, బత్తుల ప్రసాద్, మద్ది శ్రీనివాస్‌లతో మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్, ఆగస్టు 15: పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మున్సిపల్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతోపాటు అన్ని కా ర్యాలయాల్లో స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు కిరణ్‌కుమార్, జనగాం పాండు, పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బీరు మల్లయ్య, నువ్వుల ప్రసన్న, రత్నపురం పద్మ, సత్యనారాయణ, అతికం లక్ష్మీనారాయణ, తాడెం రాజశేఖర్, తుమ్మల పాండు, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఇట్టబోయిన గోపాల్, నక్కల చిరంజీవి, కడారి వినోద్ పాల్గొన్నారు.