రామగిరి, మే 31 : ఎంజీ యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలో భాగంగా శనివారం జరిగిన 2వ సెమిస్టర్, 5వ సెమిస్టర్ పరీక్షలో 40మంది మాల్‌ప్రాక్టిస్‌కు పాల్పడుతుండగా స్కాడ్ బృందాలు డిబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. 2వ సెమిస్టర్ పరీక్షకు 8,188 మంది హాజరుకావాల్సి ఉం డగా 7,145 మంది హాజరు కాగా, 946మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలో 27మంది డిబారయ్యారు.
రామన్నపేట ప్రభుత్వ కళాశాలలో 2, శ్రీ హిందూలో 1, భువనగిరి జాగృతిలో 1, ఎస్ఎల్ఎన్ఎస్లో 1, నల్లగొండ కాకకాతీయలో 2, సిద్ధార్థలో 1, డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 1, మాల్లోని శ్రీవేంకటేశ్వరలో 6, మిర్యాలగూడ హసితలో 1, సూర్యాపేటలో రాకేశ్ బీఈడీ కళాశాలలో7, దేవరకొండలోని భవితలో నలుగురు డిబారయ్యారు. 5వ సెమిస్టర్ పరీక్షలకు 2,582 మంది హాజరుకావాల్సి ఉండగా 2,233మంది హాజరుకాగా 336 గైర్హా జరైన్నారు. ఈ పరీక్షలో 13 మంది డిబార్కాగా నల్లగొండ సిద్ధార్థ్ధలో 2, చౌటుప్పల్ మాతృశ్రీలో 1, హుజూర్‌నగర్‌లోని ప్రియదర్శిలో 1, సూర్యాపేటలోని సిద్ధార్థలో 1, స్పందనలో 1, రాకేశ్‌లో 1, భువనగిరి స్టాన్ఫర్లో 3, కోదాడలోని త్రివేణిలో 1, మిర్యాలగూడ హసితలో 1, విజేతలో 1 ఉన్నారు.