నల్లగొండ విద్యా విభాగం (రామగిరి), మే 22 : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో గురువారం 25 మంది విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిపార్ అయినట్లు ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షలో 9 మంది విద్యార్థులు డీబార్ కాగా వీరిలో నల్లగొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో ఒకరు, సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఒకరు, దేవరకొండలోని ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకరు, భారతీ డిగ్రీ కళాశాలలో ఇద్దరూ, తిరుమలగిరిలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో ఒకరు, సూర్యాపేటలోని రాకేశ్ బీఈడీ కళాశాలలో ముగ్గురు ఉన్నట్లు తెలిపారు.
మధ్యాహ్నం జరిగిన ఒకటో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలలో 16 మంది డిబార్ కాగా వీరిలో నల్లగొండలోని డీవీఎం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ముగ్గురు, కాకతీయ డిగ్రీ కళాశాలలో ముగ్గురు, సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో ఇద్దరు, నీలగిరి డిగ్రీ కళాశాలలో ఒకరు, దేవరకొండలోని భారతి డిగ్రీ కళాశాలలో ఇద్దరు, సూర్యాపేటలోని ఆర్ కె ఎల్ కే డిగ్రీ కళాశాలలో ముగ్గురు, ఎస్వీ డిగ్రీ కళాశాలలో ఒకరు, భువనగిరిలోని నవభారత్ డిగ్రీ కళాశాలలో ఒకరు డీబార్ అయ్యారు.